25, జూన్ 2010, శుక్రవారం

sneham.

గుండె లోతుల్లోని గాయాన్ని కూకటి వేళ్ళతో పెకిల్లించి వేయగల అస్త్రం స్నేహం .నీ శక్తిని, నీ లోపాల్ని నీకు ధైర్యంగా చూపగల వాడె నీ అసలైన నేస్తం. నీ గుండె గాయపడితే తన గుండె తో వోదార్చే వాడె నేస్తం. కలిమిలో కలసిపోఇ..  లేమిలో తోడై ..కడదాకా కలిసుండే వాడె నేస్తం .....

15, జూన్ 2010, మంగళవారం

మనిషి లోని భయమే దయ్యం ...ధైర్యమే దైవం !

13, జూన్ 2010, ఆదివారం

  ప్రభు ... నీలోని  ఎ రూపాన్ని చూడను? చిరుజల్లులతో తడిసి  గుబాలిస్తున్న పుడమి అందం చూసి ఆనందిచాలా...జడివానలో కొట్టుకొని పోతున్న జీవరాసులని చూసి కుమిలి పోవాలా???ప్రశాంతంగా..గుండె లోతుల్ని తట్టి పలకరిస్తున్న అందమైన సాగరుడిని  చూసి ఉప్పొంగిపోవాలా.....     ఉగ్రరూపంతో ఊగిపోతూ... కబలించి వేస్తున్న సముద్రుడిని చూసి విల విల  లాడాలా??? వెండి కొండలా  మంచుతో మెరిసి పోతున్న హిమాలయాలని చూసి మురిసి పోవాలా.. అగ్ని శిఖలతో నిండి..   ఉబుకుతున్న లావా తో భయంకరంగా ఉన్న అగ్ని పర్వతాన్ని చూసి వణికి పోవాలా???  మానవ తపిదాలవల్ల మారిపోతున్న భూమాత రూపం చూసి ఇది కలియుగ అంతానికి  నాంది అని అనుకోవాలా??? 

12, జూన్ 2010, శనివారం

 అమ్మ తనానికి  అర్థం అంతరించి పోఇ కుప్ప తొట్టిలో దొర్లుతోంది !..బిడ్డ భారమైతే ...కారణాలు ఏమైనా కావచ్చు ..మానవత్వం అంతరించి పోవాలా ?  చీమల పాలు.. కుక్కల పాలు చేయాలా ?   అమానుషం కాదా?   లోకంలో అమ్మలు కాలేని అమ్మలు ఎందరు లేరు   ?  అనాధ శరణాలయం ముందర వదిలితే వారి ఆర్తి అయినా తీరుతుంది కదా ....జంతువులే నయం !వాటి మానాన అవి బ్రతికేదాక అవి తమ పిల్లలని కాపాడతాయి !ఆపాటి  కనికరం కూడా లేదా మనకి ?హంతకులకి ఉరిశిక్ష కదా వేయాలి ..మరి ఈ శిశు హంతకులకి ఎవరు వేస్తారు శిక్ష ??????????????


29, మే 2010, శనివారం

కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ ఎంతో గొప్పది .....

10, మే 2010, సోమవారం

VIVEKANANDA ROCK MEMORIAL my dream place to visit...